వేద న్యూస్, సూర్యాపేట ప్రతినిధి:
ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పి ఆర్ టి యు టి ఎస్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శ్రీ ఐ కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉద్యోగస్తులకు ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగస్తులకు హెల్త్ కార్డుల ద్వారా ఉచిత కంటి వైద్యం, సర్జరీలు చేయడం జరుగుతుందన్నారు. ఇట్టి అవకాశాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు వినియోగించుకోవాలని కోరారు.

 

రాబోయే కాలంలో మరింత సౌకర్యవంతమైన క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇప్పించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి అన్నారు. ఉద్యోగస్తుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఊట్కూరి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో హెల్త్ కార్డు ద్వారా ఉద్యోగస్తులకు జర్నలిస్టులకు తమ ఆసుపత్రిలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన వారికి సర్జరీలు కూడా చేయడం జరుగుతుందన్నారు.

అన్ని పని దినాలలో తమ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. పి ఆర్ టి యు టి ఎస్ సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆత్మకూర్ ఎస్, జాజిరెడ్డిగూడెం మండల విద్యాధికారులు ధరావత్ ధారాసింగ్, బానోత్ బాలు నాయక్, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జాన్ రెడ్డి, సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు బొల్లికొండ కోటయ్య, యాదాద్రి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ధర్మారపు వెంకటయ్య, జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు కందుకూరి శివశంకర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గోదేశి దయాకర్, దండుదుల ఎల్లయ్య, పిన్నమరెడ్డి నరేందర్ రెడ్డి, గుండేటి లక్ష్మణరావు, గుణగంటి శ్రీనివాస్, కైరంకొండ రమేష్, చక్రధర్ తదితరులు  పాల్గొన్నారు.