వేద న్యూస్, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా ఈ ఉత్సవాలకు యప్‌టీవీ, టురిటో ఫౌండర్, సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి విరాళంగా రూ.20 వేలు అందజేశారు.
ఆ నగదుకు సంబంధించిన చెక్కును ఉదయ్ నందన్ రెడ్డి అనుచరులు బొంతపల్లి గ్రామప్రజల మహత్తరమైన ఉత్సవానికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా బొంతుపల్లి గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాడి ఉదయ్ నందన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో వీణవంక మాజీ జడ్పిటిసి దసారపు ప్రభాకర్, మహంకాళి రాజ్ కుమార్ , చదువు మహేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, జున్నుతుల జనార్దన్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.