వేద న్యూస్, సినిమా:

ఏ రంగంలో అయినా పైకి రావడం అంటే అంత ఆషామాషీ కాదు. మరీ ముఖ్యంగా సినిమా రంగంలో అయితే పెట్టుబడి, డబ్బులతో కూడిన వ్యవహారం. రూ.కోట్లు కుమ్మరిస్తేనే సినిమా బయటకు వచ్చే కాలమిది. అలాంటి తరుణంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ది హీరోల్లో ఒకరిగా ఎదిగిన వ్యక్తి స్టోరీ మీరు తెలుసుకోవాల్సిందే.

ఏడీ( అసిస్టెంట్ డైరెక్టర్)గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి.. సైడ్ క్యారెక్టర్ ప్లే చేసి.. ఆ తర్వాత కాలంలో వచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకుని సినీ ఇండస్ట్రీ అగ్రనటుల్లోఒకరిగా ఎదిగారు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అతనే మాస్ మహారాజ్ రవితేజ. 

సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేకుండా నెక్స్ట్ ప్రాజెక్టుకు మూవ్ అవుతూ.. ఇండస్ట్రీలో ఎంటర్ టైన్ మెంట్ కింగ్.. గా రవితేజ నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా ముందుకొచ్చి.. చిత్ర సీమలో ఎదగాలనుకునే వారి కలలు సాకారం చేసుకోవచ్చని నిరూపించారు. కష్టేఫలి అనే సామెతకు నిదర్శనం రవితేజ అని చెప్పొచ్చు. రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.