• మరిపెడ జెడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు అనంతరావు

వేద న్యూస్, మరిపెడ:

విద్యార్థులు నిత్యం యోగ సాధన చేయడం ద్వారా వారిలో పరివర్తన కలుగుతుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపెడ ప్రధానోపాధ్యాయులు అనంతరావు అన్నారు .

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల చేత యోగాభ్యాసాలు, ప్రాణాయామాలు చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ యోగ సాధన తో విద్యార్థులలో సమూల మార్పు తీసుకురావచ్చని, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.

ఈ సంవత్సరం యోగ ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ జరుపుకోనున్నట్లు వారు చెప్పారు. విద్యార్థినీ విద్యార్థులందరూ యోగ సాధనం చేయడం ద్వారా శారీరక, మానసిక అభివృద్ధిని సాధించాలని కోరారు.

తదుపరి విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ బయగాని రామ్మోహన్, ఉపాధ్యాయ బృందం జనార్ధనా చారి, దేవుల, శ్రీశైలం, నెహ్రూ, స్వప్న, ప్రసాదరావు, రమేష్ రెడ్డి, లెనిన్, సారయ్య, జహీదా, సురేష్, రాజకుమారి, అనిత, సుధ, మంజుశ్రీ, భువనేశ్వరి, శంకర్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.