వేద న్యూస్, ఇల్లందకుంట:
పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో పీవీ చిత్ర పటానికి పూలమాలలు వేసి పూలతో ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పెద్ది కుమార్ మాట్లాడుతూ పీవీ రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీ గా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అనేక పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహా నాయకుడు పీవీ నరసింహరావు అని తెలిపారు.
పి.వి. నరసింహారావుకు 2024 ఫిబ్రవరి 9న భారతరత్న పురస్కారం పొందిన గొప్ప నాయకుడని గుర్తు చేసుకున్నారు.నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ పటిమతో అనేక విజయాలు సాధించారని, అందరికీ ఆయన జీవితం ఆదర్శనీయమని కొనియాడారు.
పీవీ ముఖ్యమంత్రి గా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ముఖ్యంగా భూ సంస్కరణలు అమలు చేసిన ఘనత ఆయనదే అని అన్నారు.పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కీ పూర్తి స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
ఆ మహా నాయకుని జీవితం ప్రతీ ఒక్కరు అధ్యయనం చేసి, ఆ గొప్ప స్ఫూర్తితో ముందుకు సాగితే అనేక విజయాలు సాధించవచ్చని అన్నారు.ఆయన ఆలోచనలు, ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ రామారావు, కనుమల్ల సంపత్, ఎక్కేటిసంజీవరెడ్డి, అన్నం ప్రవీణ్, పెద్ది శివకుమార్, గూడెపు ఓదెలు, మారేపల్లి ప్రశాంత్, గంగారం మహేష్, ధర్మకర్తలు గొడిశాలపరమేశ్వర్, గోలి కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షులు బండి మల్లయ్య, మ్యాడదా తిరుపతిరెడ్డి, మరి వీరారెడ్డి, బుర్ర రమేష్ , బీనవేణి మహిపాల్ యాదవ్, ఆరేరమేష్ రెడ్డి పిట్టల సతీష్, రెడ్డి సారంగం,ఆకునపల్లి వెంకటేష్, జిల్లా జలంధర్ రెడ్డి, భోగం పృథ్వీరాజ్, కంగాటి శ్రీనివాస్ రెడ్డి, తాడెం దిలీప్, మారేపల్లి వంశీ, పెద్ది అభిలాష్, మంకు ఐలయ్య, ఉప్పుల ఆయిల్ రెడ్డి, మారేపల్లి రమేష్, కొత్తూరు రాజేందర్, వేముల తిరుపతి, జక్కు కుమారస్వామి, మోత్కూరు శ్రీనివాస్, తాళ్లపల్లి వెంకటేష్, తట్ల కుమార్,పవన్ తదితరులు పాల్గొన్నారు.