- బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు..
వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
తెలంగాణ కేబినెట్ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు మద్దతుగా తీర్మానం చేయడాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ స్వాగతించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకుని సంబురాలు నిర్వహించారు.
ప్రణవ్ మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం అమలు చేస్తుందని చెప్పారు. బీసీ అభివృద్ధికి,వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని వెల్లడించారు.
ఈ బిల్లుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి వర్గానికి, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీహరి,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయాల్లో రాజకీయ,విద్య,ఉద్యోగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని వివరించారు. కార్యక్రమంలో ఇల్లందుకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
