కాంగ్రెస్‌ పాలనలో తిష్ట వేసిన సమస్యలు గ్రామాలవైపు కన్నెత్తిచూడని అధికారులు

ప్రభుత్వం మొద్దు నిద్ర మాని పల్లెలపై కన్నెత్తి చూడాలి

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

వేద న్యూస్ ,గంగాధర:

గంగాధర్ మండలం ముప్పిడి నర్సయ్య గ్రామంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలసి శ్రమదానం చేశారు.
అనంతరం బూరుగుపల్లి బిఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం లో ఆయన మాట్లాడుతూ
వర్షాకాలంలో పొంచి ఉన్న వ్యాధులునిధులు లేక భారంగా మారిన ట్రాక్టర్ల నిర్వహణ
నిలిచిపోయిన ఇంటింటి చెత్త సేకరణఇబ్బందులు పల్లె జనం పడుతున్నరని,గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపో యిందని,కాంగ్రెస్‌ పాలనలో పల్లెలు సమస్య లతో సతమతమవుతున్నాయినిధులు రాక,పాలక వర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభి వృద్ధి కుంటుపడి పాలన అస్త వ్యస్తంగా మారిందని అన్నారు. ప్రత్యేక అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని, పూర్తిభారం పంచాయతీ కార్యదర్శులపైనే పడిందని, ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాకపోవడంతో కార్యదర్శులు సమస్యలను పరిష్కరించలేక పోతున్నారని వాపోయారు.ఇంటింటి చెత్త సేకరణ సైతం లేకపోవడంతో పల్లె జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నన్నారు
పరిశుభ్రతే లక్ష్యంగా చెత్త సేకరణ కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేసిందని,
గ్రామ జనాభాకు అనుగుణంగా ట్రాక్టర్‌తోపాటు ట్రక్కు, ట్యాంకర్‌ను సైతం అందించమని పచ్చదనం-పరిశుభ్రతకు నిలయంగా గ్రామాలను తీర్చిదిద్దేందుకు గత కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయని అన్నారు.అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక చెత్త సేకరణ వ్యవస్థకుప్పకూలిందని,గ్రామాల్లో సమస్యలు తిష్ట వేశాయని, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీలకు ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారిందని అన్నారు.ఇంతకాలం నెట్టుకొచ్చిన కార్యదర్శులు సైతం చేతులెత్తేయడంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసిందని అన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం గ్రామాల్లో చెత్త సేకరణ కూడా చేయించ లేకపోవడంతో చొప్పదండి మాజీ సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
మరమ్మతులు చేయించలేక..
నియోజకవర్గం లో అన్నిచోట్ల చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేశామన్నారు.వాటికి సంబంధించి కిస్తీలు ప్రతినెలా రూ.6 నుంచి రూ.12 వేల వరకు చెల్లించాల్సి ఉండగా పంచాయతీల్లో నిధులు లేక ఏడాదినర్థం గా పెండింగ్‌లో ఉన్నాయని,
ట్రాక్టర్లు తీసుకొని ఐదేండ్లు కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని బాగు చేయించాలంటే రూ.20 వేల రూ.30 వేల వరకు ఖర్చవుతుండడంతో పంచాయతీలకు భారంగా మారిందన్నారు. కనీసం డీజిల్‌ కూడా డబ్బులు లేక కొన్ని పంచాయతీల్లో వారానికి, పది రోజులకు చెత్త సేకరిస్తుండగా మరికొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లనుమూలనపెట్టారన్నారుఅస్తవ్యస్తంగా పారిశుధ్యం
బీఆర్‌ఎస్‌ హయాంలో పల్లెప్రగతి ద్వారా 20 రోజులపాటు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి కాలువల్లో పూడికతీతలు, పిచ్చిమొక్కలు తొలగించారు.ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా పల్లెప్రగతిని పట్టించుకోకపోవడంతో పల్లెపాలన అస్తవ్యస్తమైందని, ప్రకృతివనాలు,హరితహారంలో నాటిన మొక్కలు సైతం నీరు లేక మోడుబారిపోయాయి. వర్షాకాలం వచ్చినప్పటికీ అధికారులు పల్లెల వైపు కన్నెత్తి చూడకపోవడంతో డ్రైనేజీల్లో మురుగునీరు పారుతూ ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,
సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయేమోనని భయపడుతున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం, మురుగునీరు రోడ్డుపై ప్రవహిచడం, రోజుల తరబడి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో పందులు,కుక్కలకు ఆవాసాలుగామారిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుధ్యం సమస్యను పరిష్కరించాలని, పల్లెప్రగతి పనుల ద్వారా పనులు చేపట్టి పల్లెలను బాగు చేయాలని కోరుతున్ననని అన్నారు.ఏడాదికిపైగా అందని బిల్లులు.సర్పంచుల పదవీకాలం పూర్తయిన తర్వాత బిల్లులు అందక కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని
ఒకపక్క బోరు మోటార్లు బాగు చేయించడం, పైప్‌లైన్‌ లీకేజీలకు మరమ్మతును చేయించడం చేశారు. ఎఫ్‌డీఎఫ్‌ నిధులు వస్తాయని అధికారులు చెప్పడంతో పనులు చేయించి ఏడాదికాలంగా కార్యదర్శులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర మాని పల్లెలపై కన్నెత్తి చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గంగాధర మండలంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.