వేద న్యూస్, చొప్పదండి :

చొప్పదండి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలను శనివారం నిర్వహించారు. ఈ మేరకు మండల వైద్యాధికారి డాక్టర్ కీర్తన విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులలో మార్పులు సంభవించాయని శుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపాల్ ఎల్ స్వాతి, ఆసుపత్రి సూపర్వైజర్ జి శ్రీదేవి, ఏఎన్ఎం నల్లల పుష్పలత, నారాయణరెడ్డి ఆశా వర్కర్లు పద్మ, స్వరూప, పలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.