ఎస్సై రమేష్ బాబు

వేద న్యూస్, నెల్లికుదురు :

విద్యార్థులు ప్రాథమిక స్థాయినించే ఉన్నతంగా చదివి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని నెల్లికుదురు ఎస్సై రమేష్ బాబు అన్నారు. సోమవారం ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన భూక్య ప్రభాకర్ నాయక్ పదివేల రూపాయల విలువ గల షూ, టై, బెల్ట్ లను స్థానిక ప్రాథమిక పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై వాటిని ప్రభాకర్ తో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సొంత ఊరికి తోచిన సహాయం చేయాలని స్వచ్ఛందంగా ప్రభాకర్ ముందుకు రావడం అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయనకు ఎస్సై సూచించారు. ప్రభాకర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులాగా యూనిఫామ్ తో కనిపించాలనే ఉద్దేశంతో సొంత ఖర్చుతో షూ బెల్ట్ టైలను అందించినట్లు చెప్పారు. హెచ్ఎం కుండె చైతన్య మాట్లాడుతూ తమ పాఠశాలలోని పేద పిల్లలకు సహాయం చేసిన ప్రభాకర్ నాయక్, ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్సై రమేష్ బాబు , నెల్లికుదురు ఎంఈఓ రాందాస్, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు నాగన బోయిన రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి నరేష్, గ్రామ పెద్దలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.