వేద న్యూస్, రుద్రూర్ :

 

కోటగిరి మండల కేంద్రంలోని మరిగమ్మ ఆలయంలో గురువారం జగద్గురు ఆది జాంబవంతుని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాంబవంతుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మ జాగరణ సమితి ఆదేశాల మేరకు ఉగాది పర్వదినం సందర్భంగా ఈ వేడుకలు జరిపినట్లు పూజారి దవులయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.