•  హక్కుల సాధనకు అంకితభావంతో పనిచేస్తా
  •  బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బండి రాజు 
  •  సంఘం బలోపేతానికి నూతన కార్యవర్గం ప్రతిజ్ఞ

 

వేద న్యూస్, ఇల్లందకుంట:

బీసీ వర్గాల హక్కుల సాధన కోసం అంకితభావంతో పని చేస్తానని, బీసీల గొంతుక అవుతానని బీసీ సంక్షేమ సంఘం మండలఅధ్యక్షుడు బండి రాజు తెలిపారు. బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం సాధించడం, బీసీ సంఘాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఇల్లందకుంట మండల అధ్యక్షుడిగా బండి రాజు ఎన్నికయ్యారు. యువజన మండల ఉపాధ్యక్షుడిగా గుర్రం రమేష్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా మురహరి రాజు, బీసీ మహిళా సంఘం మండల అధ్యక్షురాలిగా గొడుగు మానస ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ.. బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన అవకాశాలు, సముచిత ప్రాధాన్యత కల్పించే దిశగా సంఘం నిరంతరం కృషి చేయాలని సూచించారు. మండలంలోని అన్ని బీసీ కుల సంఘాలను సమన్వయం చేసుకుంటూ, గ్రామగ్రామాన సంఘాన్ని బలోపేతం చేయాలని నూతన నాయకులకు దిశానిర్దేశం చేశారు.

నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ.. తమపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సామాజిక అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తామని, బీసీ సమాజాన్ని ఐక్యంగా ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

 కార్యక్రమంలో జిల్లా నాయకులు రంగు సంపత్ గౌడ్, రాసిమల్ల రాజు, మోటం వెంకటేష్, మాదాసు సంజీవ్, నారోజు రాకేష్, మోత్కూరి శ్రీనివాస్ తదితరులతో పాటు పలువురు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *