వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో రాత్రి 10 గంటల సమయంలో బోధన్ నుండి వర్ని వెళ్తున్నా TG 16 B 4497 షిఫ్ట్ డిజయర్ కారు రోడ్డు నిర్మాణంలో ఉన్నా డ్రైనేజీని ఢీకొని బోల్తా పడింది. కారులోని ఏయిర్ బేలున్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నా ఫుల్ సింగ్ సురీక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో స్థానికులు స్పందించి బోల్తా పడిన కారును పక్కకు నెట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు. రోడ్డు నిర్మాణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో, రోడ్డు నిర్మాణంలోని లోపాలతో రెండు రోజులలో మూడు ప్రమాదాలు జరిగాయని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్లక్ష్యంగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న రోడ్డు నిర్మాణ సంస్థ పై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
