వేద న్యూస్, చిలుపూరు: జనగామ జిల్లా, చిలుపూరు మండలంలోని శ్రీ శ్రీ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం, చిల్పూరుగుట్టలో నూతనంగా నియామక పత్రాలు అందుకున్న కృష్ణమాచార్యులు మరియు ఆదిత్యాచార్యులులను శ్రీ రంగాచార్యులు ఆధ్వర్యంలో పలువురు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆలయ సేవలో వారు విశిష్టంగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంపుల రామ్ రెడ్డి, పేరాల రాకేష్, మచ్చకంటి రాజేష్, రామ్ బ్రహ్మచారి వెంకన్న, ఆలయ సిబ్బంది మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *