వేద న్యూస్, వరంగల్ టౌన్:
ఏకశిలా డిజి పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ బేతి కొండల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లవ కుమార్, ఇంచార్జి మేడం స్వప్నలత పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏకశిల విద్య సంస్థల చైర్మన్ గౌరు తిరుపతి రెడ్డి అందరికి స్వయం పరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.కాగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వాళ్ల ఎక్స్పీరియన్స్ ను తోటి విద్యార్థులతో షేర్ చేసుకోవడం జరిగింది. డీఈఓగా లతాశ్రీ, ఎంఈఓగా సాత్విక, డైరెక్టర్ గా వరుణ్ తేజ్, వైస్ ప్రిన్సిపాల్ గా మహంత్ వ్యవహరించి పరిశీలించడం,తనిఖీలు చేయడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు,ఉపాధ్యాయులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు.