- ఎల్కతుర్తి ఏఎంసీ కమిటీ బాధ్యతల స్వీకరణ
- చైర్మన్‌గా సుకినె సంతాజీ, వైస్ చైర్ పర్సన్‌గా బొక్కల స్రవంతి శ్రీనివాస్ రెడ్డి
వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి ఏఎంసీ(అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ) చైర్మన్‌గా కాంగ్రెస్
సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సుకినె సంతాజీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్కతుర్తి మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆఫీసులో ఆయనతో పాటు వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు జి కొమురయ్య, ఎం జగన్, షేక్ హక్కీం పాషా, జే వెంకటస్వామి, ఆర్ మొండయ్య, జి రాజయ్య, దాట్ల ప్రవీణ్, ఎం
రాజయ్య, బండి సుధాకర్‌లూ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
ఏఎంసీ తొలి చైర్మన్‌గా విధేయుడికి అవకాశం
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి చైర్మన్‌గా
కాంగ్రెస్ నేత సుకినె సంతాజీని నియమించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు
హర్షం వ్యక్తం చేశాయి. నేతలు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి
పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బుధవారం సుకినె సంతాజీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి.. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చైర్మన్ గిరిలో ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతాంగానికి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్థానిక మంత్రి పొన్నం ప్రభాకార్ సహకారంతో రైతులకు మేలు చేసే దిశగా అడుగులు బలంగా ఆయన వేస్తారని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. మార్కెట్ కమిటీ పాలకవర్గ సహకారంతో రైతులకు మేలు చేసే దిశగా ఏఎంసీ కమిటీ పని చేస్తుందని, స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో అన్నదాతకు మేలు చేసే దిశగా పని చేస్తామని ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ సుకినె సంతాజీ వెల్లడించారు. ఏఎంసీ కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎల్కతుర్తి ఏఎంసీ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత సుకినె సంతాజీ