- సి ఎస్ ఐ బి జె ఎం ఉన్నత పాఠశాలలో ..
వేద న్యూస్, శాయంపేట:
శాయంపేట మండలం కాట్రపల్లి గ్రామంలోని సి ఎస్ ఐ బి జె ఎం ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ జూన్ చేరియన్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలను ప్రారంభించారు.
ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గురువులను ఎప్పుడూ గౌరవించుకోవాలని, వారి త్యాగ పూరితమైన బోధలను అనుసరించి మంచి జ్ఞానవంతులుగా ప్రతి విద్యార్థి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమములో పాఠశాల కరస్పాండెంట్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను సన్మానించి బహుమతులను అందించారు .ఈ కార్యక్రమములో ఉపాధ్యాయులు రాజునాయక్, రాజన్న, బిజయ్, సామెల్, ప్రవళిక, శైలజ, ఉమ, శృతి, జెస్విన్, లిబి , విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.