- యూరియా కోసం రైతుల ధర్నా
- సగంలోడు సరిపోదని ఆగ్రహించి లారీని అడ్డుకున్న రైతులు
వేద న్యూస్ ,వీర్నపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో యూరియా కొరతను నిరసిస్తూ గురువారం రైతులు ధర్నాకు దిగారు. మండల కేంద్రంలోని మహిళా సంఘం ఆధ్వర్యంలో యూరియా సగం లోడ్ వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకోవడంతో పంపిణీని రేపటికి వాయిదా వేశారు.
దీంతో ఆగ్రహించిన రైతులు ఎల్లారెడ్డిపేట మరిమడ్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. యూరియా సమకూర్చడంతో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు పలువురు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.