వేదన్యూస్ -బెంగళూరు
బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వేదికగా బుధవారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీ ఈ సీజన్ లో తొలి ఓటమిని నమోదు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ను గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత ముందు బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ మొత్తం ఇరవై ఓవర్లు ఆడి ఎనిమిది వికెట్లను కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది.
ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ (54)పరుగులతో రాణించాడు. పడిక్కల్ (04), విరాట్ కోహ్లీ (07), పాటీదార్ (12), ఫీల్ సాల్ట్ (14)పరుగులతో మరోసారి నిరాశపరిచారు.. చివర్లో డేవిడ్ 32పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లల్లో సిరాజ్ మూడు వికెట్లు… సాయికిశోర్ రెండు వికెట్లను తీసుకున్నారు. మరోవైపు ఇషాంత్ శర్మ ,ప్రసిద్ధ కృష్ణ, అర్షద్ తలో వికెట్ తీశారు.
ఆ తర్వాత 170పరుగుల లక్ష్య చేధనలో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ మరో పదమూడు బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లను కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. జీటీ బ్యాటర్లల్లో ఓపెనర్ సాయి సుదర్శన్ 36బంతుల్లో 49పరుగులు చేసి ఔటయ్యాడు. జాస్ బట్లర్ 39బంతుల్లో 73పరుగులతో మెరుపులు మెరిపించడంతో కేవలం 17.5ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఆర్సీబీ బౌలర్లల్లో భువీ ,హేజిల్ వుడ్ తలో వికెట్ ను తీశారు.