-సిఐ మోగిలి
వేద న్యూస్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిరిసిల్ల రూరల్ సిఐ మోగిలి,ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో గణేష్ మండలపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు విద్యుత్తు వైర్ల వల్ల విద్యుత్ఘాతం సంభవించే ప్రమాదం ఉందని వాటివల్ల ప్రాణనష్టం వాటిలుతుందని తెలిపారు.మండపాల వద్ద సిసి కెమెరా ఏర్పాటు చేసుకోవాలని,మండల నిర్వాహకుల కమిటీ పేర్లను నమోదు చేసుకోవాలి.నిమజ్జనం రోజున గణేష్ శోభాయాత్రను ఏలాంటి అవాంఛనీయ సంఘనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అప్పుడే ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలి.చెరువుల దగ్గర చిన్న పిల్లలు రాకుండా పెద్దలు మాత్రమే జాగ్రత్తగా నిమజ్జనం చేయాలి.డీజె లకు ఎలాంటి పర్మిషన్ లేదు ఎవరైనా డిజే సౌండ్ బాక్సలు పెట్టినచో కేసులు నమోదు చేయబడుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సిరిసిల్ల అశోక్,పోలిసులు మరియు ఆయా గ్రామాల మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.