• ఏర్పాటు చేసి 4 నెలల గడవకముందే..!
  • లైట్లు చోరీ చేసిందెవరో..మరి?

వేద న్యూస్, చొప్పదండి:

చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన తొమ్మిదో వార్డు లో హైమాక్స్ లైటు ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడవక ముందే ఆ లైట్లు మాయమయ్యాయని, దీని  పై బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు అమరగాని రాజ్ కుమార్ గౌడ్ సోమవారం స్పందించారు.

నాలుగు నెలలు గడవకముందే అధికార పార్టీ నాయకులు, గ్రామపంచాయతీకి చెందిన కరెంటు డిపార్ట్మెంట్ వాళ్లతో కుమ్మకై హైమాక్స్ లైట్లు మాయం చేశారని ఆరోపించారు. కొద్ది కాలం కిందట హైమాక్స్ లైట్ ప్రారంభం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి హడావిడిగా ఓపెన్ చేశారని పేర్కొన్నారు. 

ఇప్పుడు 9 రోజులు బతుకమ్మ ఉత్సవాలు మహిళలు, పిల్లలు కలిసి బతుకమ్మ కోలాటలతో, ఆటపాటలతో ఆడుకుంటున్న తరుణంలో కొందరు కావాలని ఆటంకాలు ఏర్పడే విధంగా చేశారని ఆరోపించారు.  బతుకమ్మ ఉత్సవాలతో పాటు ఇతర పండుగల సందర్భంగా నిర్వహణ ఎలా? అని అడిగారు.

బతుకమ్మ ఆడే స్థలంలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేస్తే..  కావాలని కొందరు లైట్లు మాయం చేశారని అమరగాని రాజు, ఆ వార్డు ప్రజలు ఆరోపించారు.  కార్యక్రమంలో చుక్క లచ్చయ్య, బూత్కూరి శంకరయ్య, బూత్కూరి రాములు, చుక్కల అజయ్, చుక్కల అనిల్, తదితరులు పాల్గొన్నారు.