మానవుడు స్వార్థంతో ప్రకృతికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. తనకు కావాల్సిన విధంగా పకృతిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పరిణామంలో నేలపై, జీవులపై, మొక్కలపై, గాలిపై, నీటిపై అనేక ప్రతికూల ప్రభావాలు పడుతూ కాలుష్యం ఏర్పడి పర్యావరణ సుస్థిరతకు భంగం వాటిల్లుతుంది. ఈ కాలుష్యాల ద్వారా మనిషి జీవన విధానంలో, తన సంస్కృతిలోని మార్పు వస్తుంది.
ముఖ్యంగా మనిషి సంతోషంగా ఉండటానికి కొన్ని తనకు నచ్చిన విధంగా జీవించడానికి మన పూర్వీకులు పండుగలను ఏర్పరుచుకున్నారు. అలాంటి తెలంగాణ పండుగలలో ప్రకృతిని, పువ్వులను ఆరాధించే పండుగలలో ఒకటి ఈ “బతుకమ్మ పండుగ.”
బతుకమ్మ పండుగల రోజున ఉదయాన్నే స్నానం చేసి మగవారు, పిల్లలు అందరు సమూహంగా మరి అడవులకి గ్రామ పక్కన ఉన్న ఆ గ్రామం యొక్క చుట్టు పక్కల ఉన్నటువంటి కొండలపైకి, చిన్న చిన్న అడవిలోనికి, చెరువు గట్ల పైన ఉన్న చెట్ల, గుల్మాల పువ్వులను తెంపుకొని వచ్చేవారు.
అలాంటి పువ్వులలో ముఖ్యమైనవి తంగేడు పువ్వు, తర్వాత గునుగు పువ్వు, సీతమ్మ పట్టుకుచ్చుల పువ్వు, అడవి చామంతి, రోకలిబండ,ముచ్చాల, కట్లాషా, బంతి, చాబంతి పువ్వులు.. అలాగే ముందుగా అడుగున వేయడానికి గుమ్మడి ఆకులు ఇలాంటివి తీసుకొని వచ్చి.. పండక్కి అమ్మగారింటికి (అవ్వగారింటికి) వొచ్చిన ఆడబిడ్డలతో ఇంట్లో ఆడ పిల్లలకి ఇస్తే.. వాటికి కొన్ని సహజ రంగులద్ది, గుమ్మడి ఆకులను వేసి పల్లాలలో, తపుకు, తంభాలంలో పేర్చుకుని బతుకమ్మగా చేసుకుంటారు.
అందులో పసుపుతో చేసిన గౌరమ్మను, అగరోతులతో అలంకరించి డూపదీప నైవేద్యాలిచ్చి ఆ రోజు సాయంత్రం వారందరూ ఊరికి దగ్గరలో కొత్తగా చేరిన నీటి చెరువులో, కుంటలో దగ్గర చేరి సంతోషంగా పండుగ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడుకునేవారు, ఇప్పటికీ ఆడుకుంటున్నారు.
ఆ తర్వాత తెచ్చిన ఫలహారము, పెరుగుతో కలుపుకుని తెచ్చుకున్న సద్ది ప్రసాదంగా పసుపు కుంకుమలతో ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుని చివరగా బతుకమ్మను మగ పిల్లలతో చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేసి పోయిరావమ్మా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ పాటలు పడుకుంటూ ఇంటికి సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెళ్లేవారు.
బతుకమ్మను పేర్చి కోవడానికి కావలసినటువంటి పువ్వుల్లో ముఖ్యమైనది తంగేడు పువ్వు, గునుగు పువ్వు సీతమ్మ కుచ్చు పువ్వు, అడవి చామంతి పువ్వు, రుద్రాక్ష, పువ్వు, తామర పువ్వు, రోకలి బండ పువ్వు, చామంతి పువ్వు, ముద్దబంతి పువ్వు, ముఖ్యమైన పూల జాతి మొక్కలు.
ఈ మొక్కలు అంతరించిపోతున్న నందున మనకు బతుకమ్మ పువ్వులు దొరకటం లేదు. దానికి కారణం మారుతున్న పండుగల సంస్క్రతి, సంప్రదాయాలతోపాటుగా పర్యావరణ, ప్రకృతి విద్వంసం.
మన సంస్కృతిని కాపాడే పండుగలు, మనం సంతోషంగా అందరిని కలిసి మెలిసి జీవించే విధంగా ఉండే ఇటువంటి పండుగలని కాపాడుకునేందుకు మన చుట్టూ ఉన్న ప్రకృతి అంటే గాలిని, నీటిని, భూమిని, ప్రకృతి విద్వాంసం విధానాడుతూ వాతావరణ కాలుష్యం నుంచి కాపాడుకుని మన జీవన విధానాన్ని, మన సంస్కృతితో కూడిన పండుగల విశిష్టతలను, ప్రాషష్ట్యాన్ని భావితరాలకు అందించే విధంగా మన భుజస్కందాలపై ఉన్నది.
కాబట్టి, మనం ప్రకృతిని ఆరాధిస్తూ, ఈ పండుగను ప్రకృతి సహేతుకంగా జరుపుకునే విధంగా జీవించాలి. అదేవిధంగా కనుమరుగైపోతున్న ఈ వృక్షజాతులు పూల మొక్కలు జీవవైవిద్య వైవిధ్యంలో మార్పులను గమనిస్తూ మన ప్రకృతిని మనం కాపాడుకుందాం. పకృతి ని కాపాడే పర్యావరణాన్ని రక్షిద్దాం అదే మనల్ని తిరిగి రక్షిస్తుంది.
ఆడపిల్లలందరికీ పువ్వుల పండుగ బతుకమ్మ శుభాకాంక్షలు.
- రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త.
