జిల్లెల్లలో 26 ఇందిరమ్మ ఇండ్ల పత్రల పంపిణీ*
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వేద న్యూస్ ,తంగళ్ళపల్లి:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేదని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.; తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ మంజూరు పత్రాలు ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. లబ్దిదారులు వారికి కేటాయించిన ఇండ్లలోకి వెంటనే వెళ్ళాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాళ్లపేట గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై పీడీ హౌసింగ్, ఎంపీడీఓను అభినందించారు.
మట్టి కోసం ఆందోళన చెందవద్దుమట్టి కోసం లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారని తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ గ్రామంలోని చెరువు,తమకు సంబంధించిన పొలంలో ఉన్న మట్టినివినియోగించుకునేందుకు గ్రామ పంచాయితీ కార్యదర్శి ద్వారా తహశీల్దార్ కు తెలిపితే ఆయన అనుమతి తీసుకున్న తర్వాత ఆ మట్టిని గృహ నిర్మాణ అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారుకార్యక్రమంలో కెకె.మహేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప, వైస్ చైర్మెన్ నర్సింగం, పీడీ హౌసింగ్ శంకర్, డీపీఓ షర్ఫుద్దీన్, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు