వేద న్యూస్, ఇబ్రహీంపట్నం:
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో వాహనదారులు ఆ రోడ్డు గుండా వెళ్లేందుకు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు.
వర్షకొండ నుండి ఇబ్రహీంపట్నం వెళ్లే రోడ్డు ఉపరితలం దెబ్బతిని లోతైన గుంతలు ఏర్పడ్డాయి. దీని వల్ల వాహనదారులు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా వర్షాకాలం గుంతలలో నీరు చేరి పంచాయతీ రోడ్డు మరింత అధ్వానంగా మారుతుందని పలువురు పేర్కొంటున్నారు. మండల కేంద్రానికి వెళ్లే మార్గం కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో రైతులు ధాన్యం మక్కలు ట్రాక్టర్ లారిలో వేసుకొని రోడ్డు పై వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని, స్థానిక రైతులు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పగలు, రాత్రి, తేడా లేకుండా భయంతో ఆ దారిలో ప్రయాణం. దిన దిన గండంగా మారింది. రోడ్డు ఇంత పాడయి ఉన్నప్పటికీ ఏ అధికారులు స్పందించిన దాఖలాలు లేవని గ్రామ ప్రజలు అంటున్నారు. సాధారణ పౌరులకు ఏమైనా అనుకోరాని అపాయం జరిగితే దానికి బాధ్యులేవరని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించే తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలంటే మీకంత చులకన అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్&బి, పంచాయతీ, ఉన్నత అధికారులు స్పందించి రోడ్డుపై ఎర్పడిన గుంతలను మరమత్తులు చేయించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.