వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో సిఐఎస్ఎఫ్ జవాను భార్య స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని,జనసేన కార్యకర్తల సహకారంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
దేశ సేవకోసం తన భర్త CISF జవానుగా విధులు నిర్వహిస్తున్నాడనీ, గ్రామ సేవ కోసం తాను సర్పంచ్ బరిలో నిలిచానని,ప్రచారంలో ప్రజలు,పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నారని,సర్పంచ్ గా ఎన్నికల్లో గెలిచాక చేపట్టబోయే పనులను వివరిస్తుంది.
ప్రచారం సాగుతుండటంతో జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

