•  మర్రిపల్లిగూడెం సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ.. హామీలు: అభ్యర్థి మమత

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
జనసేన పార్టీ బలపరిచిన మర్రిపల్లిగూడెం సర్పంచ్ అభ్యర్థి బుధవారం మేనిఫెస్టో విడుదల చేశారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఐదేండ్ల పాలన కాలంలో చేయబోయే పనులను ప్రస్తావిస్తూ.. మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మర్రిపల్లిగూడెం సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ.. 18 హామీలు ఇచ్చినట్టు వెల్లడించారు.

స్వర్గ రథం ఏర్పాటు, గ్రామ దేవతలు పునః ప్రతిష్టాపన, వినియోగంలోకి గ్రంథాలయం, వారసంత (అంగడి) ఏర్పాటు,ప్రతివీధికి పూర్తి స్థాయిలో లైటింగ్, డ్రైనేజి, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి ఇంటికీ అకౌంట్, రూ.2 లక్షల ఇన్సూరెన్స్, ప్రతి వీధిలో చెత్త కుండీల ఏర్పాటు, గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఒకరికి బాధ్యత, చెరువుల హద్దుల ఏర్పాటు, ఉపాధి హామీ పథకం కింద చెరువుల పూడిక తీత,……

ఎస్సారెస్పీ కెనాల్, చెరువు కట్టలు, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే దారుల వెంట ఉపాధి హామీ పథకం ద్వారా స్వచ్ఛత కార్యక్రమం నిర్వహణ, వీధి కుక్కలు, కోతుల బెడద లేకుండా చర్యలు, సమ్మక్క-సారక్క జాతర ఉత్సవాల్లో కమిటీదే పూర్తి అజమాయిషికి బాధ్యత,….

అర్హులకు మాత్రమే ‘డబుల్’ ఇండ్ల పంపిణీకి తొలి ప్రాధాన్యత, తూ.చ. తప్పకుండా గ్రామ సభ తీర్మాన ప్రతుల ఏర్పాటు (సభకు ముందుగానే కరపత్రాల ద్వారా ప్రతి గడపకు పంపిణీ),ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా అందేలా చర్యలు, గ్రామ పంచాయితీ ఆదాయ వ్యయ వివరాలను ప్రతి గ్రామ సభలో ప్రవేశపెట్టడం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం, పాఠశాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత, పల్లె దవాఖాన అప్‌గ్రేడేషన్ కోసం, నిరంతరం వైద్య సదుపాయల కోసం కృషి వంటి కీలక హామీలని ప్రస్తావించారు.

మర్రిపల్లిగూడెం గ్రామ ప్రజలు,మేధావులు, ఆలోచనపరులు, విజ్ఞులైన జనం కత్తెర గుర్తుకు ఓటేసి.. అభ్యర్థి మమతను సర్పంచ్‌గా గెలిపించాలని జనసైనికులు కోరుతున్నారు.