వేద న్యూస్, ఆసిఫాబాద్:
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల తహశీల్దార్ సమయపాలన పాటించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారిగా పరిపాలనలో కీలక పాత్ర పోషించాల్సిన తహశీల్దార్ ఆఫీసుకు సమయానికి రావడం లేదని అంటున్నారు.
దీంతో మండల పరిధిలోని జైత్ పూర్ గ్రామపంచాయతీ కి చెందిన తాము గత మూడు నెలలుగా ఆఫీసర్ కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు పలువురు పేర్కొన్నారు.
తాము రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని మూడు నెలలు గడుస్తున్నా ఇంకా రాలేదని చెబుతున్నారు. తహశీల్ ఆఫీసులో పని చేసే వారు లేరని ఆరోపించారు. కలెక్టర్ ఈ విషయమై స్పందించాని జనం కోరుతున్నారు.