Nicholas Pooran

వేదన్యూస్ -ఈడెన్ గార్డెన్స్ 

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుతో  జరుగుతున్న  మ్యాచులో  లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి చెందిన   విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ (36 బంతుల్లోనే 87 ) ఊచకోత కోశారు.

ఈ క్రమంలో పూరన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ ల్లోనే  అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన రెండో ప్లేయర్గా రికార్డు సృష్టించారు.

1,198 బంతుల్లోనే ఆయన 2 వేల పరుగులు మార్కును అందుకున్నారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ (1,211 బంతుల్లో) రికార్డును చెరిపేశారు. అగ్ర స్థానంలో రస్సెల్ (1,120 బంతుల్లో) ఉన్నారు.