వేద న్యూస్, మరిపెడ:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలి వారి గూడెం గ్రామంలోని అప్పర్ ప్రైమర్ స్కూల్ (యుపిఎస్ )లో శనివారం అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న, ప్రజాశక్తి రిపోర్టర్ ఆధ్వర్యంలో ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు..మరిపెడ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శరత్ చంద్ర గౌడ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి
నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
అనంతరం మరిపెడ మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ శరత్ చంద్ర గౌడ్ మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థినీ విద్యార్థులు చేయూతనిచ్చేందుకు బుక్స్ అందించడం చక్కటి విషయమన్నారు. స్టూడెంట్స్ మరింత శ్రద్ధగా చదువుకోవడానికి, ఈ నోట్ బుక్స్ సద్వినియోగం చేసుకొని, బాగా చదువుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న, ప్రజాశక్తి రిపోర్టర్, అంబేద్కర్ పూలే మహాజన సంఘం, కమిటీ సభ్యులు చింత దిలీప్, గాలి వారి గూడెం, అప్పర్ ప్రైమర్ స్కూల్, (యుపిఎస్) హెచ్ఎం, ఆర్,వెంకన్న, టీచర్స్, బి, మురళీధర్, ఎం, వీరన్న ,ఎస్ రాజేంద్ర, టి, సావిత్రి, ఏ, ప్రేమ్ కుమార్, రామకృష్ణ, నాగరాజు,
విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.