– సర్పంచ్ బరిలో ఇందూరు సునీత- ఇందూరు చంద్రశేఖర్ దంపతులు

వేద న్యూస్, రుద్రూర్ :

గ్రామాభివృద్దె నా లక్ష్యమని ఇందూరు సునీత – ఇందూరు చంద్రశేఖర్ దంపతులు అన్నారు. ఇందూరు చంద్రశేఖర్ కాంగ్రేస్ పార్టీలో గత 25 సంవత్సరాలుగా కార్యకర్తగా ఉంటూ రుద్రూర్ మండలంలో కాంగ్రేస్ పార్టీ అంటే ఇందూరు చంద్రశేఖర్ అనే విధంగా పేరు తెచ్చుకొని రుద్రూర్ గ్రామానికి 10 సంవత్సరాలు సర్పంచ్ గా విశేషమైన సేవలు అందించడం జరిగింది. ప్రస్తుతం ఆయన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పార్టీకి సేవలందిస్తున్నారు.
ఆయన సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామంలో అధిక సంఖ్యలో సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడం జరిగిందని గ్రామ ప్రజలు అంటున్నారు. గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న గల్లీలలో మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఇందూరు చంద్రశేఖర్ గారే ప్రత్యేక చొరవతో గ్రామ పెద్దలు, గ్రామస్తుల సహకారంతో “ప్రేరణ స్టడీ సెంటర్” ను ఏర్పాటు చేసి ఎందరో నిరుద్యోగులకు చదువుకోవడానికి అవకాశం కల్పించారు. దీని ద్వారా 35 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది. అలాగే గ్రామపెద్దల సహకారంతో గ్రామ ప్రజల తోడ్పాటుతో “దేవిదాస్ రావు గోశాల” ను ఏర్పాటు చేసి దాన్ని సజావుగా నడుపడంలో క్రియాశీలకమైన పాత్రను నేటికి పోషిస్తున్నాడు. సర్పంచ్ గా 10 సంవత్సరాలుగా కాంగ్రేస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి అధికార పార్టీ బి.ఆర్.యస్ ఎన్ని ప్రలోబాలకు గురిచేసిన తనను నమ్ముకున్న కార్యకర్తలు అన్యాయానికి గురి కావద్దని, ధనాశకు, పదవీకాంక్షకు లొంగకుండా తనను నమ్మిన కార్యకర్తల కోసం, తన కన్న తల్లి లాంటి కాంగ్రేస్ పార్టీకోసం పార్టీనే అంటిపెట్టుకున్నాడు. రుద్రూర్ మండలంలో గత 10 సంవత్సరాలుగా కాంగ్రేస్ పార్టీ జెండా మోసిన ఏకైక నాయకుడు ఇందూరు చంద్రశేఖర్ అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, గ్రామస్తుల తొడ్పాటుతో రుద్రూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి సహృదయంతో ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.