వేద న్యూస్, వరంగల్:

తెలంగాణ ప్తభుత్వం, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా  గూడూరు శ్రీనివాస్  నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా ఆయనను హైదరాబాద్ సెక్రెటరియేట్ ఛాంబర్ లో కలిసిన ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ సందర్బంగా ప్రముఖ పర్యావరణ వేత్త, జే.ఎన్.టీ. యూ. మాజీ అ.ప్రొపెసర్  పిట్టల రవిబాబు గారు మాట్లాడుతూ… విదేశీ వస్త్రాలు ప్రకృతిని, పర్యావణాన్ని, భారతీయ సంస్కృతి, సప్రదాయపు విలువలను వస్త్రాలతో నాశనం చేస్తున్న సందర్భంలో మీ పదవి భాద్యతలు దేశీయ సప్రదాయ చేనేత వస్త్రాల ఉత్పత్తి పెంచి దేశానికి చేనేత శ్రామికులకు కుటుంబాలకు బాసటగా నిలిచి, ఆర్థికంగా, సంప్రదాయంగా ఉపయోగపడేలా నిలుపుతాయని వాఖ్యణించారు. 

 

అదేవిధంగా ప్రముఖ సామాజిక కార్యకర్త, రా చెరువు పరిరక్షణ సమితి సభ్యులు, బోడుప్పల్ పద్మశాలి సంఘము ముఖ్య సలహాదారులు డా.లక్ష్మివీరమల్లు నేత మాట్లాడుతూ గతకొన్ని దశాబ్దాలుగా చేనేత మగ్గం మూగబోయిందని, ఎలక్ట్రికల్ మగ్గం వచ్చాక అన్ని వర్గాలు కార్పొరేట్ వ్యవస్థ లో చిక్కుకుని చేనేత కుటుంబాలు చితికి పోయే సందర్భం. కృత్రిమ వస్త్రాలు అందంగా, ప్లాస్టిక్, ఐరన్ మొదలైన చిన్న చిన్న అలంకరణలతో చిన్నారుల అనారోగ్యం కి కారణం అవుతాయేమో అనే భయం కూడా ఉందని, కృత్రిమ వస్త్రాల వల్ల చేనేత కుటుంబాలు ఆర్థికంగా కుంటుబడిపోయాయని, ఎంతోమంది చేనేతలు అర్డర్లు లేక, వస్త్రాలు తయారులేక, తయారు అయ్యాక అమ్మకాలు లేక కుటుంబాలు ఆర్థికంగా బతుకులు చితికి పోయి సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్, నల్గొండ మొదలైన ప్రదేశాల్లో అనేకమంది ఆత్మహత్య చేసున్నారు. ఇప్పుడు నూతన పద్మ శాలి కార్పొరేషన్ చైర్మన్ లు గా మీరు మన కులవృత్తిని కాపాడే విషయంలో అత్యంత చొరవ తీసుకుని పద్మ శాలి బిడ్డల బతుకులు బాగుపడే విదంగా కృషి చేయాలని విజ్జప్తిచేశారు.

మా విజ్జప్తి కి చైర్మన్  స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తో చర్చించి సాధ్యమైనంత మేరకు త్వరగా పద్మ శాలి కుటుంబ సభ్యుల సమస్యలు ఒక్కొక్కటిగా తీర్చే విదంగా కృషి చేస్తాను అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *