వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
దేశాయిపేటకి చెందిన ఓ మహిళ తన భర్తను పోలీసులు తీసుకొని వెళ్లి 12 రోజులు కావస్తున్నా తన భర్త ఆచూకీ తెలపడం లేదని ఆరోపిస్తూ తాను ఆత్మహత్యాయత్నంకి పాల్పడిన ఘటన వరంగల్ లో వెలుగు లోకి వచ్చింది.
పోలీసులు తనను, తన బిడ్డను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యయత్నానికి పాల్పడటం నగరంలో సంచలనం కలిగించింది. తన భర్త బ్రతికి ఉన్నారా..? లేక చంపేశారా అని ఆవేదనకు గురైంది.
తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడానికి కారకులు మాత్రం మార్కెట్ చైర్మెన్, మామునూరు ఏసిపి,ఎనుమాముల సిఐ, ఎస్సైలు కారణమంటూ సూసైడ్ నోటు లో పేర్కొంది.
