ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు-ఎస్సై అశోక్
వేద న్యూస్ ,ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. వాహనాలకు నెంబర్ ప్లేట్లు,సంబంధించిన పత్రాలనుఆయనపరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్సై సిరిసిల్ల అశోక్. మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనాన్ని కూడా నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని,నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు రోడ్డుపై తిరిగినట్లు కనిపిస్తే వాటిని సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వాహనదారులు ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, వాహనాలను నడపాలని, ఆయన సూచించారు. తల్లిదండ్రులు ఎవరైనా బాధ్యత రహితంగా మైనరు పిల్లలకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తే,తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.