వేద న్యూస్, వరంగల్:

తెలంగాణ పల్లెల్లో సర్పంచ్, వార్డు, సభ్యుల తొలి దశ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని లింగాల ఘనపురం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కుందారం, కిష్ట గూడెం,చిటూర్,పటేల్ గూడెం,నవాబ్ పేట వాడ్డిచేల,కొత్తపల్లి,నేలపోగుల,వనపర్తి వద్ద పోలింగ్ కేంద్రాలకు..నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులను.. తమ ఓటును వినియోగించుకునేందుకు వరంగల్ సిటీ గార్డ్స్ పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా పోలీసు వారికి పల్లె వాసులు అభినందనలు తెలిపారు.