వేద న్యూస్, వరంగల్:
దేవునూర్ గ్రామ బీరప్ప గుడి గత 30 సంవత్సరాలుగా గ్రామ పెద్దలు నిర్మించి, భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఎన్నో సంవత్సరాలుగా భక్తులు అక్కడ మొక్కులు చెల్లిస్తూ, పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
అయితే, ఇటీవల కొంతమంది కబ్జాకోరులు గుడి పరిసర స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడం అత్యంత బాధాకరం అని, దేవాలయ స్థలాలు వ్యక్తిగత ఆస్తులు కావు అని, అవి సమాజానికి చెందిన పవిత్రమైన ఆస్తులు అని గ్రామ యువకులు కొందరు తెలిపారు.
బీరప్ప గుడి స్థలాన్ని కబ్జాకోరుల నుండి రక్షించడం ప్రతి గ్రామస్థుడి బాధ్యత అని, రాజకీయాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా అందరూ ఒక్కటై ఆలయ పవిత్రతను కాపాడాలనీ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకుని, గుడి స్థలానికి పూర్తి రక్షణ కల్పించాలని కోరుతున్నట్టు గ్రామ యువకుడు సందీప్ తెలిపారు.“దేవాలయాన్ని కాపాడటం అంటే మన సంస్కృతిని, మన విశ్వాసాన్ని, మన గ్రామ గౌరవాన్ని కాపాడినట్టే.” అని వెల్లడించారు.