• నేటి నీటి సంక్షోభం – భవిష్యత్తుకు హెచ్చరిక
  • – కాలకృత్యాలకు కూడా నీరు లేని స్థితి — ఇది సాధారణ సమస్య కాదు, రేపటి నీటి విపత్తుకు గంభీర హెచ్చరిక
  •  ఈ సమస్య ఏ సాంకేతాన్ని సూచిస్తుందో నీటి కొరత అర్ధంచేసుకోవాల్సిన తరుణం ఇది
  •  ప్రభుత్వాలకు, అధికారులకు, రాజకీయనాయకులకు ఇది ఒక ముందస్తు హేచ్చరిక

 

నీరు ప్రాణాధారం. జీవమనుగడకు నీరు అవసరం. నీరు ఒక ప్రాథమిక మానవ హక్కు (బేసిక్ హ్యూమన్ రైట్)గా గుర్తించబడినప్పటికీ, అది అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ వ్యవస్థల లోపాలను చూపిస్తుంది. విద్యార్థినుల కాలకృత్యాలకు కూడా నీరు లేకపోవడం ఏ సాంకేతాన్ని సూచిస్తుందో అర్ధంచేసుకోవాల్సిన తరుణం ఇది. తెలంగాణలోని ఒక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు నీటి సమస్యపై ధర్నా చేయడం సామాజిక-పర్యావరణ సంక్షోభానికి ప్రత్యక్ష సూచిక. చిన్నారులు ఇలా నిరసనకు దిగడం అనేది నీటి సరఫరా వ్యవస్థలో తీవ్రమైన అసమతుల్యతను తెలియజేస్తుంది.

ఇది కేవలం ఒక సంఘటన కాదు, భవిష్యత్తులో విస్తరించే నీటి సమస్యలకు ముందస్తు హెచ్చరికగా పరిగణించాలి. ఈ సమస్య పట్టించుకోకపోతే భవిష్యత్తులో అధికారుల, స్థానిక పాలకుల ఇళ్లను ప్రజలు చుట్టూముట్టే ప్రమాదమున్నది. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధుల, ఏమైల్యేలా, మంత్రుల ఇళ్ళముందు బిందెలతో ధర్నాలు చేస్తున్న వార్తలు వింటున్నాం. చేతులెత్తితే ప్రజలు దాహం సమస్యతో తీవ్రంగా బాధితులుసావుతారు. రాష్ట్రానికి సమాజం, పాలకులు, శాస్త్రవేత్తలు కలిసి దీన్ని సమస్య యొక్క సంకేతంగా భావించి సీరియస్‌గా తీసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో నీటి వినియోగం, వాననీటి సంరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుతం ఒక ప్రాంతంలో కనిపిస్తున్న నీటి కొరత, భవిష్యత్తులో ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయికి విస్తరించే ప్రమాదం ఉంది. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వంటి అంశాలు నీటి డిమాండ్‌ను వేగంగా పెంచుతున్నాయి. మరోవైపు, సహజ నీటి వనరులు పరిమితమైనవి. ఈ అసమానత (డిమాండ్-సప్లై గ్యాప్) భవిష్యత్తులో తీవ్రమైన సంక్షోభాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటి చిన్న సంగటనలను నిర్లక్ష్యం చేయకుండా, వాటిని ముందస్తు హెచ్చరికలుగా, భవిష్యత్తులో విస్తరించే సంక్షోభంగా పరిగణించి సమగ్ర నీటి నిర్వహణ వ్యూహాలను అమలు చేయాలి. భూగర్భ జలాలపై అధిక ఆధారపడటమే ఒక ప్రధాన సమస్యగా భావించవచ్చు. భూగర్భ జలాలు (గ్రౌండ్వాటర్) మన దేశంలో తాగునీరు మరియు సాగునీటి ప్రధాన వనరుగా మారాయి. కానీ ఇది సుస్థిర వినియోగం (సస్టైనబుల్ యూస్) కంటే అధిక వినియోగానికి దారి తీస్తోంది. బోర్‌వెల్స్ ద్వారా అధికంగా నీటిని పంపింగ్ చేయడం వల్ల అక్విఫర్ నీటిని నిల్వచేసుకునే గుణం కలిగిన భూపొరలు) వ్యవస్థలు ఖాళీ అవుతున్నాయి. రీఛార్జ్ కంటే ఎక్సట్రాక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల నీటి సమతుల్యత దెబ్బతింటోంది. దీర్ఘకాలంలో ఇది నీటి లభ్యతను తీవ్రంగా తగ్గిస్తుంది. కాబట్టి భూగర్భ జల వినియోగాన్ని నియంత్రించడం, రీఛార్జ్ చర్యలను పెంచడం అత్యవసరం.

పడిపోతున్న జలమట్టాలకు అనేక కారణాలు ఉన్నాయి. వర్షభావపరుస్థితులు, పర్యావరణ అసమాతుల్యత, వాతావరణంలో చోటుచేసుకుఅంటున్న మార్పులు భూగర్భ జలాల మట్టాలు (వాటర్ టేబుల్ లెవెల్స్) పడిపోవడం ఒక కీలక పర్యావరణ సమస్యగా మారుతుంది.

ఇది జలచక్ర అసమాతుల్యత (హైడ్రోజాలోజికల్ ఇంబాలన్స్) కు సూచన. ఎక్కువ లోతులో నుంచి నీటిని తీయడం వల్ల నీటి నాణ్యత కూడా దెబ్బతింటుంది (ఫ్లోరైడ్, సాలినిటీ పెరుగుదల). అదనంగా, పంపింగ్ ఖర్చులు పెరుగుతాయి. నీటి మట్టాలు పడిపోవడం వల్ల బావులు ఎండిపోవడం, వ్యవసాయం దెబ్బతినడం వంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి. దీన్ని నియంత్రించాలంటే రీఛార్జ్ పిట్స్, పర్కొలేషన్ ట్యాంక్స్ వంటి చర్యలు తప్పనిసరి. వర్షపాతం (రెయిన్ఫాల్) లో అసమానతలు నీటి సంక్షోభానికి ప్రధాన కారణం. క్లైమేట్ చేంజ్ ప్రభావంతో మొన్సూన్ పెట్ట్రన్ మారుతోంది. వర్షాలు తక్కువగా లేదా అకస్మాత్తుగా అధికంగా పడటం వల్ల నీటి నిల్వ కష్టమవుతోంది. దీర్ఘకాలిక వర్షాభావం డ్రాట్ పరిస్థితులను సృష్టిస్తుంది. ఇది భూగర్భ జలాలపై మరింత ఒత్తిడి పెంచుతుంది. వర్షాభావం – ప్రధాన కారణం కాబట్టి క్లైమేట్-రెసిలైంట్ వాటర్ మానేజ్మెంట్ విధానాలు అవలంబించాలి.

వర్షపు నీటిని సరైన విధంగా వినియోగించకపోవడం ఒక పెద్ద నష్టంగా మారుతోంది. అర్బన్ రనఫ్ రూపంలో వర్షపు నీరు డ్రైనేజీల ద్వారా నేరుగా బయటకు వెళ్తుంది. ఇది రీఛార్జ్ అవకాశాలను తగ్గిస్తుంది.

రెయిన్వాటర్ హార్వెస్టింగ్ లేకపోవడం వల్ల అక్విఫర్ రిఫీల్ జరగదు. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రతి భవనం వద్ద వర్షపు నీటి వృథాగా పోకుండా రెయిన్వాటర్ కలెక్షన్ వ్యవస్థలు తప్పనిసరి చేయాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అవసరంగా భావించి సమస్యకు ప్రథమ పరిష్కారంగా రెయిన్వాటర్ హార్వెస్టింగ్ ఒక శాస్త్రీయ, సుస్థిర పరిష్కారం.

ఇది సర్పేస్ రనఫ్ ను నిల్వ చేసి భూమిలోకి ఇంకింప చేస్తుంది. దీని ద్వారా గ్రౌండ్వాటర్ రీఛార్జ్ పెరుగుతుంది. అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో ఈ విధానం అమలు చేస్తే నీటి కొరతను గణనీయంగా తగ్గించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో అమలు చేయగల విధానం కూడా. ప్రభుత్వాలు దీన్ని విధిగా అమలు చేయాలి.

ప్రస్తుత పరిస్థితుల్లో వాటర్షెడ్ మేనేజ్‌మెంట్ ప్రాముఖ్యతగా తీసుకోవాలి. వాటర్షెడ్ మానేజ్మెంట్ అనేది నీటి వనరుల సమగ్ర సంరక్షణ పద్ధతి. ఇందులో సాయిల్ కన్సర్వేషన్, వెజిటేషన్ కవర్, నీటి నిల్వ వ్యవస్థలు ఉంటాయి. ఇది రనఫ్ తగ్గించి ఇంఫిల్ట్రేషన్ పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది అత్యంత ప్రభావవంతమైన విధానం.

దీని ద్వారా గ్రౌండ్వాటర్ రీఛార్జ్, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం వాటర్షెడ్ అప్రోచ్ కీలకం. నీటి వినియోగంలో జాగ్రత్తలుతీసుకొంటూ ప్రతివ్యక్తికి అవగాహణ కల్పించాలి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకోవాలి.

వాటర్ కన్సర్వేషన్ అనేది వ్యక్తిగత స్థాయిలో ప్రారంభమవుతుంది. డోమెస్టిక్ వాటర్ యూస్ లో వేస్టెజ్ తగ్గించాలి. లీకేజీస్ నివారించడం, ఏఫిసైంట్ అప్లిన్సెస్ ఉపయోగించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు. బిహేవియరల్ చేంజ్ కూడా ముఖ్యమే. నీటిని విలువైన వనరుగా భావించే అవగాహన పెరగాలి.

అధికారులు ముఖ్యంగా ముందస్తుగా బాధ్యతగా వ్యవసహరించాలి. నీటి ఇద్దదిపై అగ్రికల్చర్ సెక్టార్ లో వాటర్ యూస్ ఎఫిసైన్సీ పెంచడం అవసరం.

డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకలర్ సిస్టమ్స్ వాడటం ద్వారా నీటి వినియోగం 30–50% వరకు తగ్గించవచ్చు. క్రాప్ పెట్ట్రన్ మార్చడం కూడా అవసరం. తక్కువ నీరు అవసరమైన పంటలను ప్రోత్సహించాలి. అధికారులు, రైతులు, ప్రజల బాధ్యతగా తీసుకుంటే ఇది సస్టైనబుల్ అగ్రికల్చర్ కి దోహదం చేస్తుంది.

ఇందులో ప్రభుత్వాల పాత్ర చాలాకీలకం. పాలసీ మేకింగ్ లో వాటర్ గవర్నన్స్ కీలకం. గ్రౌండ్వాటర్ రెగ్యులేషన్, రెయిన్వాటర్ హార్వెస్టింగ్ లాస్ , వాటర్షెడ్ ప్రోగ్రామ్స్ అమలు చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ కాంపెయిన్స్ నిర్వహించాలి. డేటా-డ్రైవన్ నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటిగ్రాటెడ్ వాటర్ రిసోర్స్ మానేజ్మెంట్ (ఐ.డబ్ల్యూ.ఆర్.ఎం) విధానం అనుసరించాలి. మేల్కొలుపు, చివరి హెచ్చరికగా తీసుకొని అందరు ముందుకు వచ్చి సమస్యను, పరిష్కారమార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రస్తుతం కనిపిస్తున్న సంఘటనలు భవిష్యత్తు ప్రమాదాలకు సంకేతం. నీటి సంక్షోభం సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమస్యలకు దారి తీస్తుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే డ్రింకింగ్ వాటర్ స్కేర్షిటీ తీవ్రమవుతుంది.

 నీటి చుక్కను కాపాడటం అంటే భవిష్యత్తును కాపాడట

– రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *