•  నూతన పాలకవర్గానికి ప్రజలు, శ్రేయోభిలాషుల శుభాకాంక్షలు

వేద న్యూస్, ఇల్లందకుంట:

 కనగర్తి గ్రామ పాలకవర్గం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.ఈ సందర్భంగా నూతన సర్పంచ్ సంపత్ మాట్లాడుతూ..సర్పంచ్ గా తన గెలుపు తనది కాదని గ్రామ ప్రజలందరిదనీ, కేవలం తనను ముందు ఉంచి మీరంతా దగ్గరుండి గెలిపించుకున్నారని ఆ ఘనత అంతా ఊరి ప్రజలకే దక్కుతుందని మరొకసారి స్పష్టం చేశారు.

ఈ చక్కటి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరిచి తమ బిడ్డ ‘సర్పంచ్‌గా’ చాలా చక్కగా పనిచేస్తున్నాడు, ఊరిని బాగు చేస్తున్నాడు, అభివృద్ధి వైపు పయనింప చేస్తున్నాడు అని మీరంతా గర్వపడేలా ఇతర గ్రామాల ప్రజలతో చెప్పుకునే విధంగా పాటుపడతానని సంపత్ వెల్లడించారు.ఊరి కోసం, ఊరి అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కొత్త సర్పంచ్ పాటు పడతారని ఈ సందర్భంగా జనం ఆకాంక్షించారు.
 

‘‘రామంచ సంపత్ అనే నేను.. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని.. భారతదేశ సౌర్వభౌమత్వం, ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018, దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం, నా విధులు, బాధ్యతలను, భయం, పక్షపాతం లేకుండా, నిష్ఠ, నిజాయతీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను.’’ కనగర్తి గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడిగా రామంచ సంపత్ సోమవారం ప్రమాణం చేశారు.