మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
వేద న్యూస్, వేములవాడ:
మెప్మా ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
వేములవాడ అర్బన్ మండలం పరిధిలోని మారుపాక వద్ద సర్వే నంబర్ 339 లో ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలం హద్దులు సిద్ధం చేయాలని, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు పెట్రోల్ బంక్ నిర్మాణ ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరా మహిళా శక్తి కింద మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ పర్యటనలో వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డీటీసీపీఓఅన్సార్,పంచాయతీ రాజ్ ,ఇరిగేషన్ అధికారులు,డిపిఓ తదితరులు పాల్గొన్నారు.