వేదన్యూస్ – వాంఖేడ్ స్టేడియం
వాంఖేడ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విధ్వంసం సృష్టించింది. ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (67), పాటీదార్ (64)పరుగులతో రాణించారు.
దీంతో ముంబై ముందు 221పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ ఉంచింది. పడిక్కల్ (37), జితేష్ శర్మ (40) రాణించారు. వీరందరూ చేసిన విధ్వంసానికి ఆర్సీబీ పూర్తి ఓవర్లు ఆడి భారీ స్కోరు చేసింది. ముంబై బౌలర్స్ లో బౌల్ట్ (57/2), పాండ్యా (45/2)రాణించారు.