వేద న్యూస్, జయశంకర్ భూపాలపల్లి :
రోడ్డు ప్రమాదంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి.
వెంకన్న ఆర్టీవో కార్యాలయం ముందు తనిఖీలు చేపడుతున్న క్రమంలో అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీవో వెంకన్న నెల రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్ళారు.