- యువత రాజకీయాల్లో ఎదిగేలా ప్రోత్సహించాలని వేడుకోలు
- అందరినీ కలుస్తూ.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన
వేద న్యూస్, హన్మకొండ:
దేవునూరు గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి కొంగంటి సందీప్ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. గ్రామ ప్రజలను అందరినీ కలుస్తూ.. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఆత్మీయంగా అభ్యర్థిస్తున్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలని బలంగా ఆకాంక్షించే ప్రజలు, ఆ దిశగా అడుగులు వేస్తున్న తన వంటి వారిని ఆదరించి.. గెలిపించాలని కోరారు.
గ్రామ అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తనకు అండగా నిలిచి.. నిండుగా, మెండుగా ఆశీర్వదించాలని ప్రజలను సర్పంచ్ అభ్యర్థి కే సందీప్ వినమ్రపూర్వకంగా కోరుతున్నారు.

