Oplus_16908288

 వేద న్యూస్, హనుమకొండ:

 

సర్పంచిగా ప్రతి నెల వచ్చే రూ.6,500 .. మొత్తం గ్రామపంచాయతీ అభివృద్ధి కే ఖర్చు చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కే సందీప్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన బాండ్ పేపర్ పై వెల్లడించారు. దీంతోపాటు పలు హామీలను ఆయన దే వు నూరు గ్రామస్తులకు తెలిపారు.

 

 

 

“సర్పంచ్‌గా గెలిచిన తర్వాత సర్పంచ్‌కి వచ్చే జీతం ప్రతి రూపాయి గ్రామ అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తాను. దేవునూర్ గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదల కోసం కేటాయించిన భూమిని అర్హులైన ప్రతి పేదవారికి పంపిణీచేస్తాను.

 

 

గ్రామంలోని వీధిలైట్లు, డ్రైనేజ్, మంచినీరు ప్రతి ఒక్క ఇంటికిఅందేలా చూస్తాను. గ్రామ అభివృద్ధికి సర్కారు నుంచి వచ్చే నిధులకు సంబంధించిన పైసలను నెలనెలా నోటీస్ బోర్డ్‌పై పెట్టి ప్రజల అభిప్రాయంసేకరించి.. గ్రామ అభివృద్ధి పనులను చేస్తాను.

 

ప్రజల అభిప్రాయంతోనే అభివృద్ధి పనులు చేస్తానని వాగ్దానం చేస్తున్నాను.

 

గ్రామంలో విద్యార్థుల సౌకర్యార్ధం గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను.ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్సెంటర్ ఏర్పాటు చేస్తాను. అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలకు సరిపోయేలాఅదనంగా రూములు ఏర్పాటు చేస్తాను. గ్రామ అభివృద్ధికి మీ అందరి సహాయసహకారంతో ముందుండి సేవకుడినై ముందుకు నడిపిస్తాను.” అని వెల్లడించారు.

 

ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి తనను సర్పంచ్ గా గెలిపించవల్సిందిగా సందీప్ కోరారు.