వేద న్యూస్, ధర్మసాగర్ :
పాఠశాల స్థాయిలో విద్యార్థులు సమతుల, ఆహారం సరైన పోషక ఆహారం తీసుకోవడం వలన పూర్తి ఆరోగ్యంగా ఉంటాడని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం అవుతుందని డాక్టర్ అలేఖ్య అన్నారు . స్కూల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ధర్మసాగర్ మండలం సాయి పేట ప్రభుత్వ హైస్కూల్లో హెల్త్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. పరీక్షలలో మార్పులు గమనించిన విద్యార్థులను ఉన్నత స్థాయి వైద్య పరీక్షల కోసం రెఫర్ చేశారు. చేసి మందులు పంపిణీ చేశారు.ఎంపిహెచ్ఎ రమాదేవి, అంజమ్మ, హెచ్ఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.