•  సోషల్ మీడియాలో కామెంట్స్
  • శ్రియాన్స్ మురళీకృష్ణ పటేల్ వీడియో వైరల్

వేద న్యూస్, వరంగల్ టౌన్:

అబాకస్ తో ఆడుకోవాల్సిన సమయంలో మంత్రి కొండా సురేఖ మనవడు చిన్నారి తన చలాకి మాటలతో ఔరా అనిపించారు. అందరి రాజకీయ నాయకులు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులను పేర్లను ఫటాఫట్ గుర్తు పట్టడం… నేతల పేర్లను అడిగిన వెంటనే చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు జూపల్లి, సీతక్క తదితరులను గుర్తు పట్టడమే కాకుండా పేరు పెట్టీ మరి పిలిచాడు. స్వయంగా మంత్రి సురేఖ మంత్రుల సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలను చూపిస్తూ కేబినెట్ మంత్రుల చిత్రాలను చూపించగా, వారిని శ్రియాన్స్ మురళీకృష్ణ పటేల్ పేరుతో స్పష్టంగా పిలవడం సంభ్రమాశ్చర్యంగా నిలిచింది.

అయితే, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడం విశేషం. అతడు ఎవరు..కొండా ఫ్యామిలీ వారసుడు..ఈ చిన్నోడి బ్లడ్లోనే రాజకీయం ఉంది రా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు రావడం సోషల్ మీడియాలో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.