- ఖుర్షీద్ హోటల్ ప్రోప్రైటర్ పై కేసు
వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
ఖుర్షీద్ హోటల్ ప్రోప్రైటర్ పై కేసు నమోదయింది. ఈ మేరకు మట్టేవాడ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఎన్ కరుణాకర్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ప్రకారం..
వరంగల్ నగరానికి చెందిన నీలారపు రణవీర్ తన తమ్ముడు సూర్యతో కలిసి శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో మండి బజార్‌లోని కుర్షీద్ హోటల్ కు బిర్యానీ తినడానికి వెళ్లాడు.
అదే సమయంలో అక్కడ నితీష్, తరుణ్, చందు మరికొందరు వ్యక్తులు గొడవలో పాల్గొని, బాధితుడిపై దాడి చేశారు. ఈ దాడిలో రణవీర్‌కు తీవ్ర గాయాలు కాగా, కుర్షీద్ హోటల్ ప్రాప్రియెటర్ కుర్షీద్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు.
అతను ప్రభుత్వ నిబంధనలు, వరంగల్ సిటీ యాక్ట్‌ను ఉల్లంఘించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందనీ పోలీసులు వెల్లడించారు.
అన్ని వ్యాపారులు, షాప్ యజమానులు ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను ఖచ్చితంగా పాటించాలని పోలీసులు పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయనీ హెచ్చరించారు.