వేదన్యూస్, నల్లగొండ
వేములపల్లి మండలం ఆమనగల్లులో గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ తిరుపతమ్మ–నాగులమ్మ అమ్మవార్ల దేవాలయాన్ని గ్రామ సర్పంచ్ పిల్లల సందీప్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ సర్పంచ్‌కు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు.అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అభివృద్ధి,భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఐ ఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి బంటు చొక్కాయ్య గౌడ్, నాయకులు వల్లంపట్ల వెంకన్న, పెరుమండ్ల నగేష్,బచ్చు జానయ్య, కొడిదల శంకర్, వంగాల ఈశ్వర్, రామకోటి,గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, పాల్గొన్నారు.