వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా 43వ డివిజన్ తిమ్మాపురం గ్రామంలో స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఇల్లందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు విద్యపాక ఎల్లయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన జీవిత కాలంలో ఎన్నో అవమానాలను తట్టుకుని భారత ప్రజలకు స్వేచ్ఛ సమానత్వాలను అందించాలని దృఢ నిశ్చయంతో భారత రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టి ప్రతి పౌరుడు దేశంలో సమానత్వంగా సమాన అవకాశాలు పొంది ప్రజలందరూ తమ హక్కులను తెలుసుకొని అభివృద్ధిలోకి రావాలని ఎన్నో వాటర్ పొట్టని ఎదుర్కొని అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టారు. కాబట్టి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు ముందుండి నడవాలని రాజ్యాంగాన్ని కాపాడుకొని అంబేద్కర్ కు ఘనమైన నివాళిని అర్పించాలని ముఖ్య అతిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా అంబేద్కర్ సీనియర్ నాయకులు ఇల్లందుల రవి స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఆర్గనైజర్ కొమ్ము భాస్కర్, ఇనుగాల సునీల్, స్థానిక ఆటో యూనియన్ అధ్యక్షులు జోగు శ్రీనివాస్, 43వ డివిజన్ జి డబ్ల్యూఎంసి జవాన్ ప్రశాంత్, స్థానిక జిడబ్ల్యూఎంసి సిబ్బంది మరియు అంబేద్కర్ సంఘం నాయకులు ప్రజలు పెద్దలు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.