వేద న్యూస్,శాయంపేట:

 

మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరణ శాయంపేట మండలం తేదీ 03/12/2025 నుండి తేదీ 05/12/2025 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ , వార్డు సభ్యుల ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు స్వీకరణ కార్యక్రమం సూచించిన స్వీకరణ కేంద్రాల్లో స్వీకరించబడతాయని శాయంపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఫణి చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు.

 

శాయంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో శాయంపేట, ఆరెపల్లి, పత్తిపాక ,హుస్సేన్ పల్లి గ్రామాలు నామినేషన్ పత్రాలు స్వీకరించబడతాయి.

తారాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తహరాపూర్, కొత్తగట్టు సింగారం, గట్లకానిపర్తి, నరసింహులపల్లి గ్రామాలు నామినేషన్ పత్రాలు స్వీకరించబడతాయి.

*పెద్దకోడపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో పెద్దకోడె పాక,జోగంపల్లి, మైలారం, గోవిందాపూర్ గ్రామాలు నామినేషన్ పత్రాలు స్వీకరించబడతాయి.

ప్రగతి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వసంతపూర్, ప్రగతి సింగారం, అప్పయ్యపల్లి ,నేరేడుపల్లి గ్రామాలు నామినేషన్ పత్రాలు స్వీకరించబడతాయి.

కాట్రపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నూర్జహాన్ పల్లి, కాట్రపల్లి ,సాధన పల్లి ,రాజు పల్లి ,గ్రామాలు నామినేషన్ పత్రాలు స్వీకరించబడతాయి.

కొప్పుల గ్రామపంచాయతీ కార్యాలయంలో కొప్పుల గంగిరేణి గూడెం సూర్య నాయక్ తండ గ్రామాలు నామినేషన్ పత్రాలు స్వీకరించబడతాయి.