వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :

శ్రీ పరాభవ నామ సంవత్సరము లో అన్ని శుభాలే జరుగుతాయని ఆమనగల్లు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ తెలిపారు.గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం ను వివరించారు.రాజకీయాలు రసవత్తంగా ఉంటాయని తెలిపారు.సకాలంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు.అన్ని ఆలయాలలో యజ్ఞ యాగాలు జరుగుతాయని తెలిపారు.పంటలు బాగా పండుతాయి అని,ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయని తెలిపారు.దేశాల మధ్య యుద్ధ వాతావరణం,ముఖ్యం గా ఆసియా దేశాలు యుద్ధాలు జరుగుతాయి అన్నారు.సరిహద్దులో ఉద్రిక్త,రికార్డ్ స్థాయిలో అగ్ని,రోడ్ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగి ధరలు పెరుగుతాయి అన్నారు. తెల్లదాన్యలు ఎక్కువ పండుతాయి అని తెలిపారు. నూతన చట్టాలు అమలు జరుగుతాయని తెలిపారు.అన్ని ప్రాంతాల్లో సమృద్ధి గా వర్షాలు,వాణిజ్య రంగం అభివృద్ది చెందుతుందని తెలిపారు.షేర్ మార్కెట్ వారు జాగ్రత్త గా ఉండాల న్నారు.తమిళ నాడు,కేరళ లో అధిక వర్షాలు నమోదు అవుతాయి అన్నారు.నూనెలు ధరలు పెరుగుతాయి అని, ముస్లిం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిల్లల సందీప్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.