లబ్ధిదారుల చేతుల్లోకి స్మార్ట్ రేషన్ కార్డులు*
*పాపన్నపేట లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ పావని నరేందర్ గౌడ్*
*లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు!*
వేద న్యూస్, పాపన్నపేట
పాపన్నపేట మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ లింగంపేట పావని నరేందర్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
*అక్రమాలకు అడ్డుకట్ట – పారదర్శక పంపిణీ:*
ఈ సందర్భంగా సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ మాట్లాడుతూ పాత రేషన్ కార్డుల స్థానంలో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత పెరుగుతుందని, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
*డిజిటల్ కార్డుల ప్రత్యేకతలు*
క్యూఆర్ కోడ్ (QR Code) మరియు చిప్‌తో కూడిన ఈ స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలో ఎక్కడైనా సులభంగా రేషన్ సరుకులు పొందే వీలుంటుందని అధికారులు వివరించారు. ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులు ఉంటే, తగిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
*లబ్ధిదారుల ఆనందం:*
చాలా కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు చేతికి అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎర్రోళ్ల రాజు భూమయ్య, పౌలు, సీతానగరం రాజు, బెస్త శ్రీశైలం, గ్రామపంచాయతీ సిబ్బంది అరవింద్ తో పాటు రేషన్ డీలర్లు ముశేట్టి కిష్టయ్య, సింగారపు శంకరయ్య, మల్దొడ్డి కృష , క్యాసగల్ల ప్రవీణ్ గౌడ్, కుర్తివాడ ప్రసాద్ గౌడ్, దోసని సంగమేష్, కుమ్మరి పోశయ్య, వల్లం దేశి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
