*నార్సింగిలో 552 కొత్త రేషన్ కార్డుల పంపిణీ
అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేత*
వేద న్యూస్, పాపన్నపేట
మండల కేంద్రమైన నార్సింగి గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నార్సింగి గ్రామంలో మొత్తం 552 కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడంతో ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేషన్ కార్డులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నారాయణ గౌడ్, ఉపసర్పంచ్ నరేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
